వైయస్సార్ ను మరిచే మూర్ఖలమా: సిఎం రోశయ్య

వైయస్ సేవలను మరచిపోయే మూర్ఖులం, దుర్మార్గులం కాదు. ఇలాంటి చేష్టల వల్ల పరలోకంలో ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరదు. ఆయన బతికున్నా ఇలాంటి కోరికలను కోరేవారు కాదేమో.." అని ముఖ్యమంత్రి రోశయ్య యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దానం నాగేందర్ కూడా యువజన కాంగ్రెసు కార్యకర్తలపై తీవ్రంగా మండిపడ్డారు. "ఏయ్.. యూత్ కాంగ్రెస్..బుద్దుందా? ఇలా రాజకీయం చేసే పాడు చేసుకుంటుండ్రు..బుద్దుండాలి..తమాషా చేస్తున్నారా? ఇలా చేస్తే యూత్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తా" అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని నిరసనకారులను శాంతింపజేశారు. రాహుల్, జగన్ చిత్రపటాలున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ వారు గొడవకు దిగారు.












Click it and Unblock the Notifications