చంద్రబాబు నాయుడు ఓదార్పు: వైయస్ వారసత్వంపై ప్రశ్నలు

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ ఓదార్పు రాజకీయాల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనదైన ఓదార్పునకు సిద్ధపడ్డారు. వైయస్ పాలనలో హత్యలకు గురైన తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాల సభ్యులను ఆయన కలుసుకున్నారు. వారికి ఓదార్పు సంగతేమిటని కాంగ్రెసును ప్రశ్నించారు. వైయస్ వారసత్వ రాజకీయాలపై ధ్వజమెత్తారు. కాంగ్రెసు ఓదార్పు రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసత్వానికి కాంగ్రెస్‌ పార్టీ, ఆయన తనయుడు జగన్‌ ఎందులో పోటీ పడుతున్నారు? నేర చరిత్రలోనా, అవినీతిలోనా? అని ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో తమ పార్టీ కార్యకర్తలు 196 మంది హత్యకు గురయ్యారని, వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి, పునరావాసం కల్పించాలని ఆ తరువాతే కాంగ్రెస్‌ అయినా, ప్రభుత్వమైనా, ఆయన వారసులైనా ఇతర విషయాలు మాట్లాడాలని ఆయన అన్నారు. వైఎస్‌ ఆరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో తెదేపా కార్యకర్తలు 207 మంది దారుణ హత్యలకు గురయ్యారని, ఇందులో 196 మంది వైఎస్‌ పాలనా కాలంలోనే మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

'వైఎస్‌ తండ్రిది నేర చరిత్ర. రౌడీ షీటర్‌. వ్యాపారంలో లాభాల కోసం చంపారు. వైఎస్‌ సైతం అనేక మందిని పొట్టనపెట్టుకున్నారు. వీరి దౌర్జన్యాల గురించి 'పాలెగాళ్ల రాజ్యం' పేరుతో పౌరహక్కుల సంఘం ఎప్పుడో కరపత్రం వేసింది. పోలీసుల సాక్షిగా పరిటాల రవిని చంపించారు. హత్యలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. ఇంత దారుణాలు జరుగుతున్నా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఏమీ పట్టదా? రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ హత్యలు జరగలేదు. చనిపోయిన వారిలో 95 శాతం మంది బీసీ, ఎస్సీ, అల్పసంఖ్యాక వర్గాలు..పేదలే' అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఏయే జిల్లాలో ఎంత మంది హత్యకు గురయ్యారనే లెక్కలను కూడా ఆయన చెప్పారు.

వైయస్ పాలనలోని బాధితుల పిల్లల్ని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌లో ఉంచి చదివిస్తున్నానని తెలిపారు. వీరితో తాను మాట్లాడినప్పుడు పెద్దయ్యాక ఏం చేస్తారని అడిగితే..తమ తండ్రిని చంపిన వారిని చంపుతామని కొందరన్నారని, ఇది విని తనకు చాలా బాధేసిందని వెల్లడించారు. బాగా చదువుకుని, జీవితంలో స్థిరపడి, తల్లిని బాగా చూసుకోవాలని నచ్చజెప్పానని, అనంతరం వారిలో మార్పు వచ్చిందని వివరించారు. బాధిత కుటుంబాలకు రూ.3.5 కోట్లు సాయం చేసినట్లు తెలిపారు. ముఠా నాయకుడు సీఎం అయితే ఏం జరుగుతుందో ముందుగానే తాము పుస్తకం ప్రచురించామని, తరువాత కూడా ఆయన అరాచకాలపై పలు పుస్తకాలు వేశామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+