గీతారెడ్డికి ఢిల్లీ పిలుపు: మార్పులపై పుకార్లు షికార్లు

ముఖ్యమంత్రి కె. రోశయ్య అస్వస్థతకు గురై నిమ్స్ లో చేరడం, ఈ నెల 3వ తేదీ నుంచి పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికే ఆమెను ఢిల్లీకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయనే పోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా గీతారెడ్డికి చెప్పారు.
కాగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ గురువారం నామినేషన్ వేస్తున్నారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు సోనియా గాంధీ తరఫున నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి, దీని కోసం ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆయన బుధవారం ప్రధాని రాష్ట్ర పర్యటనలో కూడా పాల్గొనలేదు. ఢిల్లీ వెళ్లే స్థితిలో కూడా లేరు. దీంతో ముఖ్యమంత్రి తరఫున నామినేషన్ వేయడానికి మాత్రమే గీతారెడ్డిని ఆహ్వానించినట్లు కూడా చెబుతున్నారు. అయితే, రాష్ట్ర పరిస్థితిపై గీతారెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications