ముఖ్యమంత్రి రోశయ్యకు నిమ్స్ లో వైద్య పరీక్షలు

ముఖ్యమంత్రి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్య ఆరోగ్య శౄఖ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్నందునే తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ముఖ్యమంత్రిని దానం నాగేందర్, పితాని సత్యనారాయణతో పాటు సీఎం పేషీ ముఖ్య కార్యదర్శులు సీవీఎస్‌కే శర్మ, దినేష్‌కుమార్ పరామర్శించారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి వైద్య నిపుణులు సుభాకర్ ముఖ్యమంత్రి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొంటారని, పావురాలగుట్టలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని దానం నాగేందర్ చెప్పారు.












Click it and Unblock the Notifications