ఎపిపిఎస్సీ పరీక్షలపై సచివాలయం ముట్టడి: విద్యార్థుల అరెస్టు

ఇదిలాఉండగా గ్రూప్-1లో తెలంగాణ వాటా కోసం ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద తెలంగాణ ఉద్యమ ఐకాస ధర్నా చేపట్టింది. ఎపిపిఎస్సీ గ్రూప్ -1లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతనే పరీక్ష నిర్వహించాలని ఎబివిపి కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎపిపిఎస్సీ చైర్మన్ గా వెంకట్రామిరెడ్డిని తొలగించాలని కూడా వారు డిమాండ్ చేశారు. తెలంగాణకు 42 శాతం వాటా కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.
గ్రూప్ - 1 పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు ఏపీపీఎస్సీ అత్యవసరంగా సమావేశమైంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఈసారి తప్పకుండా నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నెల 5వ తేదీన గ్రూప్ -1 పరీక్ష నిర్వహించడానికే ఎపిపిఎస్సీ కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పరీక్ష సందర్భంగా తెలంగాణ రాజకీయ జెఎసి, ఒయు జెఎసి ఈ నెల 5వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి.












Click it and Unblock the Notifications