వైయస్ జగన్ ఓదార్పుపై చంద్రబాబు కామెంట్

Chandrababu Naidu
శ్రీకుకాళం: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆయన మంగళవారం శ్రీకాకుళం పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆరేళ్లు రాష్టాన్ని భ్రష్టు పట్టించినందుకు ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారా అని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఏం సాధించారని ఓదార్పు యాత్ర చేపడుతున్నారని ఆయన అడిగారు.

మంత్రుల కన్ను పడితే గుట్టలు, కొండలు కూడా తరిగిపోతున్నాయని ఆయన అన్నారు. కన్నెధార గ్రానైట్ గనుల లీజు రద్దుకు పోరాడుతామని ఆయన అన్నారు. ఆ గనులను గిరిజనులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య పాలనలో రాష్ట్రం జ్వరాంధ్రగా మారిందని చంద్రబాబు విమర్శించారు. విద్యార్థులకు ఫీజలు తిరిగి చెల్లించేవరకు పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులను పట్టించుకోకుండా రోడ్లన్నీ వైఎస్‌ విగ్రహాలతో నింపేస్తున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+