వైయస్ జగన్ పై సోనియాకు ఇప్పుడే తెలిసిందా: చంద్రబాబు నాయుడు

రాజకీయ ప్రయోజనాల కోసమా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఇన్నాళ్లు ఓపిక పట్టినట్టున్నారన్నారు. ఇప్పటికైనా మేలుకున్న సోనియా ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన ఆస్తులపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆదాయానికి మించి ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాలకు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. సదరు అక్రమ ఆస్తులను వెంటనే జప్తు చేసి వాటిని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన విమర్శించారు. అవినీతిపై తాము రాజీలేని పోరు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications