కాంగ్రెసు ఎమ్మెల్యే టిజి వెంకటేష్ పై తెరాస నేత హరీష్ రావు ఫైర్

మొదట అక్కడి నాయకుల మధ్యే సమైక్యత లేకున్నప్పటికీ సమైక్య వాదాన్ని ఎత్తుకోవడం విచిత్రంగా ఉందన్నారు. సీమాంధ్రులు శ్రీకృష్ణ కమిటీని అయైమయంలో పడేయడానికే అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. కాంగ్రెసు నాయకులు రాయపాటి, మేకపాటి, లగడపాటిలతో పాటు టిజి వెంకటేష్ వంటి వారు అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి, వారి వారి వ్యాపార ప్రయోజనాల కోసమే సమైక్యం అంటున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రకటించేంత వరకు ఉద్యమం ఆగదన్నారు.
శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకించటంపై మాట్లాడుతూ డిసెంబర్ లో తెలంగాణ ప్రకటించిన అనంతరం సీమాంధ్ర నాయకుల ఒత్తిడికి లొంగి వెనక్కి తీసుకోవడాన్ని తాము వ్యతిరేకించామన్నారు. కమిటీతో పని లేకుండా బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణను ఏర్పాటు చేయాలన్నదే తమ ఉద్ధేశ్యమన్నారు. తెలంగాణ ఏర్పాటుపై టీఆర్ఎస్ కు బాధ్యత ఉన్నందునే తాము నివేదిక ఇచ్చినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications