సీమాంధ్ర ఎంపిలు బలిసి మాట్లాడుతున్నారు: మధు యాష్కీ

బస్సు చార్జీలు లేకుండా హైదరాబాద్ వచ్చిన లగడపాటి రాజగోపాల్ అన్ని అస్తులు ఎలా సంపాదించారని ఆయన అడిగారు. కావూరి, రాయపాటి, లగడపాటి తెలంగాణను దోచుకుని తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమానికి కొట్టుకుపోతారని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను వారు అవమానిస్తున్నారని ఆయన అన్నారు. ఈ అవమానాలను తెలంగాణ ప్రజలు సహించబోరని ఆయన అన్నారు.
పదవుల కోసం గతంలో తెలంగాణ నాయకులు మోసం చేసి ఉండవచ్చునని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిస్తే ప్రజలు తరిమి కొడతారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం పల్లెపల్లెకూ పాకిందని ఆయన అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చి ఇంకా అధికారం కొనసాగించాలని సీమాంధ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications