చంద్రబాబు నాయుడు చేతిలోకి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి డైలీ?

చంద్రబాబు చేతిలోకి పత్రిక వెళ్లిపోతుండడంతో జర్నలిస్టులు పలువురు రాజీనామాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆ పత్రికలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన జర్నలిస్టులున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతిలో ఏదో మేరకు తెలంగాణ విషయాలకు ప్రాధాన్యం లభిస్తోంది. చంద్రబాబు చేతిలోకి వెళ్తే ఆ మాత్రం అవకాశాలు కూడా ఉండవనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణకు చెందిన జర్నలిస్టులు ఒక్కరొక్కరే తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ అసిస్టెంట్ ఎడిటర్ రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రారంభిస్తున్న తెలంగాణ దినపత్రికలో ఎడిటర్ గా చేరుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications