వైయస్ జగన్ గనుల వ్యవహారంపై ముప్పేట దాడి

YS Jagan
హైదరాబాద్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ సున్నంరాయి నిక్షేపాల కేటాయింపుపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు. ప్రతిపక్షాల నాయకులే కాకుండా సొంత పార్టీ కాంగ్రెసు నాయకులు కూడా ఆయనపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. వైయస్ జగన్ ఖనిజాలను అడ్డగోలుగా దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడెల శివప్రసాదరావు ధ్వజమెత్తారు. వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సరస్వతి వ్యవహారం చూసి తనకు అశ్చర్యం వేసిందని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. సంపద అంతా ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతమవుతోందని ఆయన అన్నారు. జగన్ వ్యవహారాలపై సోనియా, మన్మోహన్ సింగ్ స్పందిస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

వైయస్ జగన్ పై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా విరుచుకుపడ్డారు. సున్నంరాయి నిక్షేపాల వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా జగన్ కు ఖనిజాలను కేటాయించారని ఆయన విమర్శించారు. జగన్ ఆస్తులపై విచారణ జరిపించాలని తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. సున్నంరాయి నిక్షేపాల కేటాయింపు వ్యవహారంపై బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ కూడా జగన్ పై విమర్శలకు, ఆరోపణలకు దిగారు. వైయస్సార్ క్రిమినల్ మైండ్ తో వ్యవహరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తిరుపతిలో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+