ఆ ముగ్గురు మంత్రులపై నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ ఫైర్

వైఎస్ చనిపోతే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారు ఇప్పుడు ఎంపీలపై విరుచుకు పడటం హాస్యాస్పదం అన్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నామని, తాము రాజకీయాల్లో ఉన్నారనే విషయం వారికి తెలియకుంటే మేమేమీ చేయలేమని అన్నారు. హై కమాండ్ ముందుకు వెళదామని తప్పు ఎవరిదో అక్కడే తేల్చుకుందామని హెచ్చరించారు. తెలంగాణకు మీరు అనుకూలంగా ఉన్నట్టయితే మీరు ముందు నడిస్తే మేము ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ విషయంలో కేసీఆర్, కాంగ్రెసు అని కాకుండా అందరినీ ప్రోత్సహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications