గ్యాంగ్ ఆఫ్ ఫోర్: కాంగ్రెసు ఎంపిలపై మంత్రుల మండిపాటు

Madhu Yashki
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీకి చెందిన నలుగురు పార్లమెంటు సభ్యులపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డి, జి. వివేక్, మందా జగన్నాథంలపై సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు దానం నాగేందర్, ముఖేష్, దామోదరం రాజనర్సింహ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని వారు ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు.'వాళ్ళు పార్టీలోకి ఎప్పుడొచ్చారు. ఎంపీలు కాకముందు ఎక్కడున్నారు. ఎంతకాలం పార్టీ కోసం పనిచేశారు. మేం దశాబ్దాలుగా జెండాలు మోశాం. వాళ్లు నిన్నగాక మొన్న వచ్చి, పదవులు పొంది, పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీలుగా ఉంటూ తెరాస అధినేత కేసీఆర్‌ను పొగుడుతారా? మనం ఎటు పోతున్నాం. దీన్ని అదుపు చేయకుంటే పార్టీ ప్రమాదంలో పడుతుంది''అని వారిపై విరుచుకుపడ్డారు.వారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు.

మంత్రివర్గ సమావేశం నుంచి అధికారులు బయటికి వెళ్ళిపోయాక తొలుత వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్‌ ఈ విషయాన్ని పరోక్షంగా లేవనెత్తారు. మీడియాలో ఏదో ఒకటి మాట్లాడేందుకు పోటీ పడుతూ కొందరు నేతలు లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తున్నారని అన్నారు. మంత్రులు కూడా తలో విధంగా మాట్లాడే పరిస్థితి ఇబ్బందులు సృష్టిస్తుందని పేర్కొన్నారు. అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రోశయ్య జోక్యంచేసుకుని మనమంతా ఏమైనా చిన్న పిల్లలమా? అన్నీ చెప్పాలా? అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత బీసీ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్‌ మాట్లాడుతూ నలుగురు ఎంపీల తీరుపై నేరుగానే గురిపెట్టారు. 'గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంద జగన్నాథం 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలోకొచ్చారు. అప్పటికి దాకా వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మధుయాష్కీ 2004లో నేరుగా అమెరికా నుంచి వచ్చి పోటీచేసి ఎంపీ అయ్యారు. వివేక్‌ పారిశ్రామికవేత్తగా ఉంటూ 2009లో ఎంపీగా గెలిచారు. వీరిలో ఏ ఒక్కరైనా ఎంపీలు కాకముందు పార్టీ కోసం పనిచేశారా? పార్టీ జెండా పట్టారా? ఎప్పుడైనా భుజాన పెట్టుకున్నారా? కాంగ్రెస్‌ పార్టీకి వాళ్ళు చేసిందేమిటి? మేమంతా పార్టీ కోసం మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. జెండాలు మోశాం. ఉద్యమాలు చేశాం. ఇప్పుడు వాళ్ళే మొత్తం పార్టీ అన్నట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏకంగా తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరావుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. దీని వల్ల పార్టీ బాగా నష్టపోతోంది. దీన్ని అదుపుచేయాలి" అని ముఖేష్‌ అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ కోసం పాటుపడిన నేతలంతా మౌనంగా ఉంటే పార్టీకి చేటు తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. దామోదరం రాజనరసింహ కూడా ఆ నలుగురు ఎంపిల తీరుపై అదే తీరులో మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+