నల్గొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు ఆవరణలో కొందరు దుండగులు దారుణ హత్యకు పూనుకొన్నారు. ఓ కేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన బంగారు కొండయ్య అనే వ్యక్తిని ప్రత్యర్థులు కోర్టు ఆవరణలోనే అందరు చూస్తూ ఉండగా నరికి చంపేశారు. కొండయ్య నాగార్జునసాగర్ కు చెందిన వ్యక్తి. అయితే వివాహేతక సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది.
కోర్టు ఆవరణలో గోడకు ఒరిగి కూర్చున్న కొండయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా విరుచుకుపడి నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.