స్త్రీలపై దాడులకు ప్రత్యేక చట్టం తీసుకువస్తాం: సబితారెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: మహిళలపై దాడులను నిరోధించడానికి ప్రత్యేక చట్టం తీసుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర హోంమంత్రి సబితా రెడ్డి అన్నారు. ఇప్పుడున్న చట్టాలలో మార్పులు చేయటం, కొన్ని కొత్త చట్టాలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సభలో చర్చించి త్వరలో ప్రత్యేక చట్టం తీసుకు రావటానికి కృషి చేస్తానన్నారు. అంతే కాకుండా అన్ని మహిళా హాస్టళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచుతామని ఆమె చెప్పారు. అన్నింట్లోనూ కళాశాలల యాజమాన్యం, తల్లిదండ్రులు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పారు. ర్యాగింగ్ నిరోధానికి అందరూ సహకరించాలని ఆమె కోరారు.