వంద మంది కెసిఆర్ లూ ఏం చేయలేరు: దేవేందర్

వందమంది కేసీఆర్‌లు అడ్డుపడినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని దేవేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణకు టిడిపి అవసరముందో లేదో రాజకీయ, విద్యార్థి ఐకాసలు తేల్చుకోవాలని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ద్రోహి అని వ్యాఖ్యానించిన కేసీఆర్‌పై దేవేందర్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకైక శత్రువు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు అని ఆయన ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications