హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ వికృత ప్రతాపం సామాన్యునిపై చూపించారు. మన రాష్ట్రంలోని పోలీసులు అందులోనూ హైదరాబాద్ పోలీసులు చాలా సంఘటనల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తారని నిజం మరోసారి నిరూపితమయ్యింది. తాజాగా హైదరాబాద్ లోని ఓ కాల్ సెంటర్లో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులను తీవ్రంగా కొట్టారు. మాసాబ్ టాంక్ నుండి వెళుతున్న వారిని ఎస్ఐ సుధీర్ వారిని ఆపి తీవ్రంగా కొట్టారు. గాయపడ్డ వారిని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ విద్యార్థులు వెంటనే వెళ్లి సైఫాబాద్ పోలీసు స్టేషన్ లో ఎస్ఐ, పోలీసు సిబ్బందిపై కేసు పెట్టారు.సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.