హైదరాబాదులో టిడిపి నేత చలసాని పండు దారుణ హత్య

చలసాని పండు రెండు రోజుల క్రితం తన అనుచరుడు మహేందర్ రెడ్డితో కలిసి హైదరాబాదు వచ్చాడు. దీంతో మహేందర్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చలసాని పండు పెనమలూరు శాసనసభా నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో మంత్రి పార్థసారథిపై ఆయన ఓటమి పాలయ్యారు. చలసాని పండు ఓ సెటిల్మెంట్ వ్యవహారంలో హైదరాబాదు వచ్చినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెటిల్మెంట్ వ్యవహారంలోనే ఆయన హత్యకు కారణమై ఉంటుందని కూడా భావిస్తున్నారు. పండుపై పలు కేసులున్నాయి. ఆయన కాంగ్రెసు నాయకుడు వంగవీటి రంగా హత్య కేసులో కూడా నిందితుడు.












Click it and Unblock the Notifications