వైయస్సార్ విగ్రహాల కబ్జా: నెల్లూరులో ముదురుతున్న వివాదం

నెల్లూరు శివారులోని బుచ్చిరెడ్డిపాలెం స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల రెడ్డి స్వస్థలం. ఆయన విగ్రహ ప్రతిష్టాపనకు కొంత స్థలం కేటాయించారు. అయితే, వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఆ భూమిని జగన్ వర్గీయులు కబ్జా చేశారు. దీంతో ఒక వర్గం తీవ్ర మనస్తాపానికి గురవుతోంది. నెల్లూరు జిల్లాలో మహామహులు పట్టి పెరిగారు. వారిని కించపరిచేలా వైయస్సార్ విగ్రహాలను ప్రతిష్టించాలనే ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, నెల్లూరు గాంధీ సెంటర్ లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం కన్నా పెద్దగా వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications