అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబుకు పదేళ్ల జైలు శిక్ష

బుధవారం ఉదయం జడ్జిమెంటు వాయిదా పడిన తర్వాత సత్యంబాబు కోర్టు ఆవరణలోనే మౌనంగా రోదించాడు. మృతురాలు ఆయేషా మీరా తల్లి శంషాద్ సైతం సత్యంబాబు తల్లి మరియమ్మ వద్దకు వచ్చి ఇందులో సత్యంబాబు పాత్ర లేకున్నప్పటికీ పోలీసులు ఆయన్ను ఇరికించారని, అందుకు మేము ఏమీ చేయలేక పోతున్నామని క్షమాపణలు కోరింది. మొదటిసారి వాయిదా పడిన అనంతరం కోర్టుకు రావాల్సిన సత్యం బాబు తరపు న్యాయవాది కోర్టుకు మధ్యాహ్నం గైర్హాజరయ్యారు. దీంతో జడ్జి మరికాసేపు తీర్పు వాయిదా వేశారు. తరువాత సత్యంబాబు లాయరు వచ్చిన తర్వాత కోర్టు ప్రారంభం ఆయ్యింది. కేవలం శాస్త్రీయ ఆధారాలతోనే శిక్ష వేయడం సరికాదని సత్యంబాబు తరఫు న్యాయవాది జడ్జికి విన్నించాడు. ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం ఈ కేసును సిబిఐ దర్యఫ్తుకు అప్పగించాలని డిమాండ్ చేసిన విషయాన్ని తెలిపారు. దాంతో పాటు కుటుంబానికి సత్యంబాబే దిక్కని, ఆయన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తీర్పు వెలువరించాలని సత్యంబాబు తరఫు న్యాయవాది శ్రీనివాస్ జడ్జిని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి మరో పదినిమిషాలు కోర్టును వాయిదా వేశారు.
సత్యంబాబు అంతకుముందు తనకు ఉరిశిక్ష వేయాల్సిందిగా కోరాడు. ఉదయం విచారణ సందర్బంగా జడ్జి నీకు ఏ శిక్ష కావాలని సత్యంబాబుని అడిగితే నాకు ఉరి వేయండి. నా కుటుంబానికి నేనే ఆధారం. కాబట్టి నాకు యావజ్జీవం కన్నా ఉరి వేయండి. ఆ తరువాత నా కుటుంబానికి న్యాయం చేయండని కోరాడు. కొందరు పెద్దవాళ్లు రక్షించడానికే పోలీసులు సత్యంబాబును ఇరికించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మృతురాలు తల్లి, మహిళా సంఘాలు కూడా సత్యంబాబు నిర్దోషిగా పేర్కొంటున్నారు.
కేసులో నిందితుడిగా సత్యంబాబును పోలీసులు పట్టుకొని విచారణ చేసిన విషయం తెలిసిందే. రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన ఆయేషా హత్యకు ఈ రోజు విజయవాడ కోర్టులో తుది తీర్పు రానున్నప్పటికీ ఈ కేసులో సత్యంబాబును నిర్దోషి అంటూ ఇటు బాధితులు, అటు సత్యంబాబు తల్లి అంటున్నారు. కాగా కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకున్నప్పటీకీ సాంకేతిక ఆధారాల కారణంగా విచారణ చేపట్టనున్నారు. అయితే సత్యంబాబే అసలు సాక్షి అనడానికి ఉన్న ప్రత్యక్ష సాక్షి ఆధారం మాత్రం ధనరాజు.
ఆయేషా హత్య జరిగిన రోజు ఆమె ఉంటున్న దుర్గ హాస్టల్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ హాస్టల్ వద్దనే సత్యంబాబు తచ్చాడుతున్న విషయాన్ని చూశాడు. ధనరాజు చక్రం చిత్రం చూడటానికి వచ్చి సత్యంబాబును చూశాడు. అంతకుమించిన ప్రత్యక్ష ఆధారాలు సత్యంబాబుపైన లేవు. సత్యంబాబు తల్లి కూడా తన కొడుకు అమాయకుడని, పెద్దవాళ్ళను రక్షించటం కోసం పోలీసులు తన కొడుకును బలి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నా కొడుకును రక్షించుకోవడానికి రెండున్నరేళ్లుగా పోరాడుతున్నానని, ఇంకా ఎన్నాళ్లయినా పోరాడుతానని ఆమె అంటున్నారు.
తన కూతురు హత్య కేసులో అనవసరంగా ఓ అమాయకుడిని బలి చేస్తున్నారని, ఈ కేసులో సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని హతురాలు ఆయేషా తల్లి శంషాద్ బేగం అంటున్నారు. ఈ హత్యలో అసలు సూత్రదారులు అయిన కోనేరు రంగారావు బంధువులు, కవిత సౌమ్య కుటుంబం వారిని వదిలి సత్యంబాబును పోలీసులు పట్టుకెళ్లి అనవసరంగా పెద్దవారిని వదిలేస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు మధ్యలో మేము, సత్యంబాబు వంటి మధ్యతరగతి వాళ్లమే బలి అవుతున్నామన్నారు. కాని కేసులో ప్రధాన నిందితులు అయిన పెద్దవాళ్లు మాత్రం తప్పించుకుంటున్నారు. సత్యంబాబును కాకుండా అసలు హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, అయితే వారికి మరణ శిక్ష కన్నా మరెవరూ ఆడవారిపై దాడులు చేయటానికి భయపడేలా కాలో, చెయ్యో తీసేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక్కడి కోర్టులో తీర్పు పెద్దవాళ్లకు అనుకూలంగా ఉంటే పై కోర్టుకు అప్పీలు చేసుకుంటామని శంషాద్ అంటున్నారు. అయితే మహిళా సంఘాలు తప్పు ఎవరు చేశారనే దానితో సంబంధం లేకుండా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications