ముఖ్యమంత్రి రోశయ్యపై మరోసారి కొండా సురేఖ ధ్వజం

జగన్ ఓదార్పు వెంట ఎమ్మెల్యేలు లేకపోయినా, మంత్రులు రాకపోయినా ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని ఆమె అన్నారు. తాము కేంద్రం నుంచి టిక్కెట్లు తెచ్చుకున్నా గెలిపించే సత్తా మాత్రం ప్రజలకే ఉందన్నారు. జగన్‌ను వైఎస్ అంతటి నాయకుడిని చేయాలని సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కారంచేడులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం వైఎస్‌దని, అంతా జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. పులులు, సింహాలు అడవిలోకి రానంత వరకు తోడేళ్లు, నక్కలు రాజ్యమేలుతాయని, ఇప్పుడు అవి వచ్చాయని, కనుక తోడేళ్లు, నక్కలు ఇక పరుగులు తీస్తాయని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications