వైయస్ విగ్రహం ఏర్పాటుపై చీరాలలో వివాదం

కాలనీలోని చర్చి, పాఠశాల దగ్గర తాము విగ్రహం ఏర్పాటు చేసుకుంటే చీరాల ఎమ్మెల్లే రౌడీయిజం ప్రదర్శించి వారి అనుచరులను పంపించి ఏర్పాటును అడ్డుకుంటున్నాడని ఎస్సీ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మేం రాజశేఖర్ రెడ్డిని చూసి ఓటు వేశామని, ఎమ్మెల్యేని చూసి ఓటు వేయలేదన్నారు. విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్న స్థలం మాది ఆని, మా స్థలంలో ఏర్పాటు చేసుకుంటే, ప్రభుత్వానికిగాని, పోలీసులకుగాని, ఎమ్మెల్యేకు గాని ఏం సంబంధమని వారు ప్రశ్నిస్తున్నారు. వైయస్ మా దేవుడని, ఆయన మాలాంటి పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని ఆయన కోసం మా ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక్కడ విగ్రహం పెట్టి తీరుతామన్నారు.
విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న పోలీసులు తమకు రెవెన్యూ అధికారులు సమాచారం అందించారని, ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటును చేస్తున్నారని వారు చెప్పటంతో వచ్చామన్నారు. చర్చి ఒక మతానికి సంబంధించినదని, ఆలాంటివి ఉమ్మడి ఆస్తి అవుతుందని, అక్కడ విగ్రహం ఏర్పాటుకు అనుమతి తీసుకుంటే మాకు ఏమీ ఆభ్యంతరం లేదని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications