తీర్పు నచ్చకుంటే మరో అవకాశముంది: అయోధ్యపై రోశయ్య

రేపు పాఠశాలకు సెలవు ప్రకటించాల్సిన అవసరం లేదని, సెలవు ప్రకటిస్తే ప్రభుత్వమే దానిని పెద్దదిగా చేసినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వం అలర్టుగానే ఉందని, పోలీసు అధికారులు సైతం ఇప్పటికే అన్ని చోట్లు సమీక్షలు చేశారన్నారు. మతపెద్దలు, రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనడానికి సహకరించాలన్నారు.
తీర్పు ఏ వర్గం వారికైనా నచ్చకపోతే మరో అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు వచ్చేదే చివరి జడ్జిమెంట్ కాదని ఎవరికైనా న్యాయంగా తోచకపోతే సుప్రీంకోర్టులో పిల్ వేసుకోవచ్చని సూచించారు. అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలని, కాని ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడవద్దన్నారు. రాష్ట్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
రాష్ట్రంలోని ప్రజలందరూ శాంతియుతంగా, సామరస్యంగా ఉండాలని హోంమంత్రి సబితారెడ్డి కోరారు. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నప్పటికీ రాజ్యాంగబద్దంగా పోరాటం చేసుకోవచ్చు కానీ, రాజ్యాంగానికి విరుద్దంగా ప్రవర్తించరాదన్నారు. పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ఆమే విలేకరులు సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications