డిస్ సమావేశానికి ముందు తెలంగాణ ఎంపిలదేం మీటింగ్: శైలజానాథ్
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం కోసం మరణించిన విద్యార్థులు, ఇతరులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం సరియైనదేనని ప్రభుత్వ చీప్ విప్ శైలజానాథ్ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడరాదన్నారు. నివేదిక తరువాత అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్ ఎంపీల సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సమావేశం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. వారు ముందుగా అలా సమావేశం ఏర్పాటు చేసుకోవటం సమంజసం కాదని చెప్పారు.