ఆలయాల నిర్మాణం రాజకీయ పార్టీల పని కాదు: వెంకయ్యనాయుడు

తీర్పు అనంతరం ఎలాంటి ఆమానుష ఘటనలు జరగపోవటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఎప్పుడూ ఇలాగే శాంతిగా ఉండాలని ఆయన కోరారు. తీర్పుపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారన్నారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బిజిపిని మతతత్వ పార్టీగా చూపించడానికి ప్రయత్నించాయన్నారు. కానీ కోర్టు తీర్పుతో వారి ఆరోపణలు అవాస్తవమయ్యాయని, తాము ఒక మతానికి అనుకూలం అన్న ఆలోచన పటాపంచలయ్యిందన్నారు. తాము కేవలం అత్యధికుల మనోగతాన్ని కోవలోకి తీసుకొని మాట్లాడామన్నారు. కాని మందిరం నిర్మిస్తామని మాత్రం ఖచ్చితంగా ఎప్పుడూ చెప్పలేదన్నారు. కోర్టు తీర్పు పట్ల అత్యధికులు సంతోషంగా ఉన్న కారణంగా దీనిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.












Click it and Unblock the Notifications