నాపైనే చర్యలా అంటూ డిఎస్ పై కొండా సురేఖ ధిక్కార స్వరం

వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనకూడదని అధిష్టానం ఎక్కడా చెప్పలేదని, ఓదార్పు యాత్రలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పలేదని ఆమె అన్నారు. తన మాటలను వక్రీకరించారని ఆమె అన్నారు. అన్ని విషయాలు సోనియాకు చెప్తానని, సోనియా అపాయింట్ మెంటు దొరికిన వెంటనే వెళ్లి అన్ని విషయాలూ చెప్తానని ఆమె అన్నారు. రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు సీట్లు గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే నాయకత్వ బాధ్యతలు వైయస్ జగన్ కు అప్పగించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఆగుతుందని తాను అనుకోవడం లేదని ఆమె అన్నారు. మరణించిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లుతున్నారని ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications