కెకె సీమాంధ్రులను అవమానపరుస్తున్నాడు: శైలజానాథ్

Sailajanath
హైదరాబాద్: ప్రభుత్వ చీప్ విప్ శైలజానాథ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.కేశవరావుపై ధ్వజమెత్తారు. కెకె తెలంగాణకు అనుకూలం అనే పేరుతే సీమాంధ్రులను ఆవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆన్నారు. ప్రతి దానికి తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని మధ్యలోకి లాగటం ఆయనకు భావ్యం కాదని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తెలంగాణ కోసం అంతగా మాట్లాడుతున్న కేశవరావు ఇన్నేళ్లుగా తెలంగాణ కోసం ఏం చేశారో మొదట చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు.

బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి ఒక ప్రాంతానికి అనుకూలంగా చెందినవాడిగా మాట్లాడటం తగదన్నారు. పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడాలి. కాని ఆయన అలా మాట్లాడకూడదని అన్నారు. అసలు కెకె ఏం మాట్లాడుతారో ఆయనకే అర్ధం కాదని విమర్శించారు. ఆయన కాంగ్రెస్ వ్యక్తి అయి ఉండి ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. హెచ్చరికలు, రెచ్చగొట్టే మాటలు ఆయన వయసుకు తగినవి కాదని తెలుకోవాలని ఆయన సూచించారు. ఆయన తన మాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+