ఎంపి వైయస్ జగన్ ఓదార్పు యాత్రనే పిసిసి టార్గెట్

కాగా, వైయస్ జగన్ కు చెందిన నాయకులపై మరింత పెద్ద యెత్తున చర్యలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ నెల 10వ తేదీన ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 11వ తేదీన ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సంబంధించి ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తాను తొలగించాలనుకుంటున్న మంత్రుల జాబితాతో పాటు కొత్తగా తాను తీసుకోబోయే మంత్రుల జాబితాతో ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటించిన బాలినేని శ్రీనివాస రెడ్డికి ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. అలాగే, సబితా ఇంద్రారెడ్డి నుంచి హోం మంత్రిత్వ శాఖను తీసేసి మరో శాఖను ఆమెకు అప్పగిస్తారని చెబుతున్నారు.
ఈ నెలాఖరులోగా వైయస్ జగన్ గందరగోళానికి తెర వేయాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే పిసిసి క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications