ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ టూర్: వైయస్ జగన్ క్యాంప్ లో టెన్షన్

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య ఢిల్లీ పర్యటనతో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శిబిరంలో టెన్షన్ చోటు చేసుకుంది. తమ విషయంలో ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడానికే రోశయ్యను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించినట్లు భావిస్తున్నారు. ఆయనతో పాటు సీనియర్ నేత కె. కేశవ రావును కూడా ఢిల్లీకి పిలిపించడం కూడా వారిని ఆలోచనలో పడేసింది. ఇందులోని మతలబు ఏమిటో వారికి అర్థం కావడం లేదు. రోశయ్య కన్నా ముందే కేశవరావు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం పలు ఊహాగానాలకు తెర తీస్తోంది. కేశవరావు వైయస్ జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే విషయం కొత్తదేమీ కాదు. కేశవరావుకు పిసిసి అధ్యక్ష పదవి అప్పగిస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కకున్నా 2014లో ముఖ్యమంత్రి కావడానికి వీలైన పిసిసి పదవి అయినా సోనియా అప్పగిస్తుందనే ఆశతో వైయస్ జగన్ వర్గం ఉంది. కేశవరావుకు పిసిసి పదవి అప్పగిస్తే ఇక ఏ మాత్రం ఆశలు లేకుండా పోతాయి. వైయస్ జగన్ పై కాకున్నా తమపై చర్యలకు అధిష్టానం ఒడిగట్టవచ్చునని కూడా జగన్ వర్గానికి చెందిన నాయకులు అంటున్నారు. పిసిసి కొంత మంది నాయకులపై చర్యలు తీసుకున్నప్పటికీ వారు వెనక్కి తగ్గడం లేదు. అందువల్ల తమను పూర్తిగా అణచివేసేందుకు ఏ విధమైన చర్యలకైనా అధిష్టానం పూనుకోవచ్చునని అనుకుంటున్నారు.

గతంలో చాలా సార్లు రోశయ్య మంత్రి వర్గ విస్తరణకు ప్రయత్నాలు చేశారు. ప్రతి సారీ ఏదో రకమైన ఆటంకం ఎదరువుతూ వచ్చింది. చాలా సార్లు జగన్ వర్గం వ్యూహాత్మకంగా అందుకు పడింది. ఇప్పుడు ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించాలనే విషయంపై కూడా వారు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏమైనా, తమపై వేటు తప్పదనే అభిప్రాయంతోనే వారు ఉన్నట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+