పేరుకు గవర్నమెంట్ టీచరే, ఆస్తులు మాత్రం 4 కోట్లపైనే

ఈ సోదాలలో 4కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఆయన కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ధర్మపురిలో 14 ఎకరాల పొలం ఉన్నట్లు, అలాగే మెదక్ జిల్లాలోనూ ఓ ప్రాంతంలో 33 గుంటల భూమి ఉన్నట్లు కనుగొన్నారు. కాగా మూడు నెలల క్రితం ఏసీబీ దాడుల్లో విజయానందన్ అనే ఫారెస్టు అధికారికి భారీ అక్రమ ఆస్తులున్నట్లు బయటపడ్డాయి. ఆ ఫారెస్టు అధికారికి ఉపాధ్యాయుడు రవీందర్ సమీప బంధువు కావటంతో అధికారులకు ఈయనపైనా అనుమానం వచ్చి, సమాచారాన్ని సేకరించారు. రవిందర్ కూడా అక్రమ ఆస్తులు ఉన్నాడన్న సమాచారం అందటంతో అధికారులు ఏకకాలంలో ఆయన ఇంటిలో, ఆయన బంధువుల ఇంటిలో సోదాలు చేశారు.












Click it and Unblock the Notifications