తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ అంగీకరించారా?

గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ నాయకుడు కె. కేశవ రావు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సోనియా తెలంగాణకు అంగీకరించారని ఆయన చెప్పారు. దానికి ఎటువైపు నుంచి కూడా ఖండన రాలేదు. కానీ, అనవసరంగా సోనియా పేరును వివాదంలోకి లాగవద్దని సీమాంధ్ర నాయకులు కేశవరావునుద్దేశించి అన్నారు. తెలంగాణ నాయకులు పెట్టుకునే సభలకు మాత్రం వారు వ్యతిరేకత చూపడం లేదు. పార్టీ కార్యక్రమంగానే అమరవీరుల సంస్మరణ సభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ నాయకులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీకి, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీకి చెప్పే తాము ఈ సభలను నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు. తెలంగాణ కార్యక్రమాల నిర్వహణకు అధిష్టానం పేరు వాడుకోవద్దనే మాట ఎవరూ అనడం లేదు. అంటే, కాంగ్రెసు నాయకులకు సోనియా గాంధీ నుంచి స్పష్టమేన సంకేతాలు అందాయా అని కూడా ఆలోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications