కర్ణాటకలో 16 మంది శాసనసభ్యులపై సస్పెన్షన్ వేటు

అక్టోబర్ 6వ తేదీన పార్టీల బలాబలాలను మార్చకుండా యెడ్యూరప్ప బలపరీక్షకు సిద్ధపడేలా చూడాలని గవర్నర్ భరద్వాజ స్పీకర్ బోపయ్యను ఆదేశించారు. అయితే, స్వయం నిర్ణయాధికారాన్ని ఉపయోగించి 16 మంది శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అక్టోబర్ 6వ తేదీన 16 మంది సభ్యులు యెడ్యూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. వారి సస్పెన్షన్ తో సభలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 208కి తగ్గింది. కాంగ్రెసు, జెడిఎస్ బలాలు కలిపితే 101 మంది సభ్యులు మాత్రమే అవుతున్నారు. దీంతో 106 మంది సభ్యుల బలంతో గట్టెక్కాలని యెడ్యూరప్ప భావిస్తున్నారు. అయితే, రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా సాగే అవకాశాలున్నాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications