గవర్నర్ భరద్వాజ్ ను రికాల్ చేయాలి: అరుణ్ జైట్లీ డిమాండ్

Arun Jaitly
న్యూఢిల్లీ: కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని గవర్నర్ భరద్వాజ్ సృష్టించారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు అరుణ్ జైట్లీ విమర్శించారు. భరద్వాజ్ ను రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజభవన్ ను భరద్వాజ్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. రాజకీయ నిష్పాక్షికతను, రాజ్యాంగబద్ధతను భరద్వాజ్ విస్మరించారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేసేందుకు, రాజకీయ గంతులకు భరద్వాజ్ రాజభవన్ ను వాడుకున్నారని ఆయన అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన శాసనసభ్యులపై చర్య తీసుకోవద్దని గవర్నర్ స్పీకర్ కు సూచించడం సరి కాదని ఆయన అన్నారు. ఒక రకంగా భరద్వాజ్ స్పీకర్ ను బెదిరించారని ఆయన వ్యాఖ్యానించారు.

విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మళ్లీ విశ్వాస పరీక్షకు గవర్నర్ తేదీని నిర్ణయించారని, ఇది సరి కాదని ఆయన అన్నారు. గవర్నర్ భరద్వాజ్ రాజీనామా చేసి, కావాలనుకుంటే రాజకీయాల్లో చేరవచ్చునని మరో బిజెపి నేత ఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా హాజరయ్యారు. గవర్నర్ వ్యాఖ్యలపై తాను మాట్లాడదలుచుకోలేదని, తమ పార్టీ అధ్యక్షుడు మాట్లాడగలరని యెడ్యూరప్ప అన్నారు. గవర్నర్ గా నియమితులైన రోజు నుంచి భరద్వాజ్ కాంగ్రెసు ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

తమపై వేసిన అనర్హత వేటుపై 16 మంది తిరుగుబాటు శాసనసభ్యులు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై బెంగళూర్ లోని హైకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. కాగా, మరోసారి విశ్వాస పరీక్షకు గవర్నర్ భరద్వాజ్ ఈ నెల 14వ తేదీని నిర్ణయించారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తుతోందని గవర్నర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+