సక్రమంగా రుణాలు అందిస్తే ఆత్మహత్యలు నిరోధించవచ్చు: రోశయ్య

బ్యాంకులే సూక్ష్మ రుణాలు ఆగడాలకు కారణమని రోశయ్య వ్యాఖ్యానించారు. బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారులు అందరూ రుణాలు పొందేవిదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 30 శాతం రుణాలు మాత్రమే లబ్దిదారులు తీసుకున్నారని మిగతా రుణాలు కూడా సాథ్యమైనంత త్వరగా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరీంనగర్ లోని సిరిసిల్ల తరహా ప్యాకేజీని మిగిలిన అన్ని ప్రాంతాల్లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అందరికీ రుణాలు సక్రమంగా అందితే ఆత్మహత్యలు నిరోధించవచ్చునని ఆయన కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు.












Click it and Unblock the Notifications