వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నెల్లూరులో వైఎస్ విగ్రహ ఏర్పాటుపై మళ్లీ వివాదం

అయితే విగ్రహ ఏర్పాటును కొందరు అడ్డుకోవటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విగ్రహ ఏర్పాటుకు మునిసిపల్ కార్యాలయం అనుమతిని చూపించాలని పోలీసులు అడిగితే అనుమతికోసం దరఖాస్తు చేసుకున్నామని అనుమతులు ఇంకా రాలేదని చెప్పారు. దాంతో దిమ్మెను కూడా కూల్చారు. దీంతో రెచ్చిపోయిన మార్కెట్ వ్యాపారులు ధర్నాకు దిగారు. తమకు వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటును స్థానిక ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి అడ్డుకుంటున్నారని వారు అరోపిస్తున్నారు. తమకు వెంటనే విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ మార్కెట్ నుంచి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.