వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటక పరిస్థితి రావద్దన్న సోనియా గాంధీ

రోశ య్య ఇటీవలి తన ఢిల్లీ యాత్ర విశేషాలను సహచరులకు వివరించారు. సోనియాతో జరిగిన భేటీలో సంస్థాగత అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, తాను మేడమ్‌తో భేటీ అయిన రోజే కర్ణాటకలో విశ్వాసపరీక్షకు సంబంధించిన అంశం చర్చకు వచ్చిందని, ఈ విశ్వాస పరీక్ష సమయంలో స్థానికంగా కాంగ్రెస్ నేతలు పెడదోవ పట్టించారని సోనియా చెప్పారని ఆయన అన్నారు. కర్ణాటక స్థానిక నేతలు తొందరపడ్డారని, అక్కడ దెబ్బతిన్నామని సోనియా అభిప్రాయం వ్యక్తంచేశారని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ బలహీన పడేందుకు వీల్లేదని సోనియాగాంధీ స్పష్టం చేశారని వివరించారు.