సూక్ష్మరుణ సంస్థలపై చర్యలు మాటల్లో కాదు చేతల్లో చూపాలి: ఈటెల
State
oi-Srinivas G
By Srinivas
|
కరీంనగర్: సూక్ష్మ రుణ సంస్థల అక్రమాలపై ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని టీఆర్ఎస్ ఎల్పీ ఈటెల రాజేందర్ శుక్రవారం కరీంనగర్ అన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో సూక్ష్మ రుణ వేధింపుల కారణంగా చనిపోయారని, కొందరు వేధింపులకు గురవుతున్నరన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చట్టం తీసుకు వచ్చామని, దానిని అమలు చేస్తామని చెప్పడం కాదని బాధితులను ఆదుకొని, సూక్ష్మరుణ సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
మద్యాన్ని వాటిపై ఉన్న ధర కంటే ఎక్కువ ధరకు అమ్మరాదని ప్రభుత్వానికి సూచించారు. అధిక ధరకు అమ్మితే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. అధిక ధరలకు కొందరు వ్యాపారులు అమ్ముతున్నారని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.