కామన్ వెల్త్ లాస్ట్ మినిట్ ఘనతంతా కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిదే

S Jaipal Reddy
న్యూఢిల్లీ: కామన్‌ వెల్త్ క్రీడలు విజయవంతంగా పూర్తి కావడంలో కీలక పాత్ర పోషించినందుకు పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎస్. జైపాల్ రెడ్డిని కలుసుకుని ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, కంపెనీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్, ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌తో పాటు పలువురు మంత్రులు ఆయనను అభినందించారు.కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణ సంక్షోభంలో పడడంతో క్రీడలు జరిగేందుకు పది రోజులు ఉందనగా, సెప్టెంబర్ 23న జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రుల బృందానికి ప్రధాన బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి క్రీడల నిర్వహణ కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీ అధికారాలను పూర్తిగా తగ్గించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సెప్టెంబర్ 23న జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి సురేశ్ కల్మాడీని ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించలేదు.

ఈ సమావేశం తర్వాత ఏర్పాట్ల విషయంలో ఏ లోపాలున్నా, కామన్‌వెల్త్ క్రీడల సమాఖ్య అధ్యక్షుడు మైకేల్ ఫెన్నన్ నేరుగా జైపాల్ రెడ్డిని కానీ చంద్రశేఖర్‌ను కానీ కలుసుకోవాలని నిర్ణయించారు. ప్రధాన నిర్ణయాల్లో కల్మాడీ ఎవర్నీ సంప్రదించలేదని తేలడంతో అప్పటి నుంచీ కామన్‌వెల్త్ క్రీడలకు సంబంధించి ప్రధాన నిర్ణయాలను జైపాల్ భుజస్కంధాలపై పెట్టాలని నిర్ణయించారు. దీనితో జైపాల్ రెడ్డి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, లెఫ్టినెంట్ గవర్నర్ తేజేందర్ ఖన్నా, హోంమంత్రి చిదంబరం, విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ, క్రీడల మంత్రి గిల్‌లతో ఎప్పటికప్పుడు సమావేశాలు జరిపి యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

కాగా ఢిల్లీ ప్రభుత్వ తప్పిదం వల్లనే క్రీడల నిర్వహణకు వారం రోజుల ముందు ఒక వంతెన కూలిందని, అదొక్కటే తమకు మచ్చగా మిగిలిందని షీలా దీక్షిత్ అంగీకరించారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి ప్రధానితో మాట్లాడి సైన్యాన్ని దించడం ద్వారా వంతెనను ఆరు రోజుల్లో నిర్మించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్రీడలు జరిగిన పది రోజులూ జైపాల్ రెడ్డి ఢిల్లీలోనే ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+