ఆంధ్ర రాజధాని కోసం కొట్లాట: విజయవాడనా, ఓంగోలా?

హైకోర్టు బెంచ్ ను తమ పట్టణంలో ఏర్పాటు చేయాలని ఒంగోలు న్యాయవాదులు సోమవారం నుంచి ఆందోళన మొదలు పెట్టారు. గుంటూరులో బదులు హైకోర్టు బెంచ్ ను ఒంగోలులో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు న్యాయవాదులు కొంత మంది ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఇది రాజధాని గొడవకు దారి తీస్తోంది. రాష్ట్రం విడిపోతే గుంటూరు, విజయవాడ ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఆ రెండు నగరాల ప్రజలు, రాజకీయ నాయకులు కోరుతున్నారు. ఒంగోలును రాజధానిగా చేయాలని రాయలసీమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ - గుంటూరును తాము రాజధానిగా అంగీకరించబోమని వారంటున్నారు. ఒంగోలు రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న నాయకుల్లో రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్, కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ ముఖ్యులు.












Click it and Unblock the Notifications