వైయస్ జగన్ క్యాంప్ పై భగ్గుమంటున్న ఆనం సోదరులు

వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు ఆనం సోదరులపై తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో వారు పాల్గొనకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. బహిష్కృత కాంగ్రెసు నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వారిపై మండిపడుతున్నారు. వైయస్ విగ్రహాల ప్రతిష్టాపనకు ఆనం సోదరులు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ ఓదార్పు యాత్రకు రూపొందించిన పోస్టర్లపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫొటోలు పెట్టకపోవడంపై ఆయన ఇటీవల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వారి ఫొటోలు పెడితే దుర్వ్నియోగం చేస్తున్నారని, వారి ప్రజాదరణను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు రావచ్చునని ఆయన అన్నారు. మొత్తం మీద, నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర పార్టీలోని ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది.












Click it and Unblock the Notifications