హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నం ఆయోధ్యనగర్లో ఉన్న అంజిరెడ్డి లేడీస్ హాస్టల్లో ఉంటున్న మమత అనే లెక్చరర్ సోమవారం ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం ఆమె తన గదిలో ఫ్యాన్ కు ఉరెసుకొని చనిపోయింది. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. మమత మొయినాబాద్ లోని గ్లోబల్ ఫార్మసీ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తోంది. మమతది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.