బెజవాడ పర్యటన రద్దుతో చిరంజీవికి వంగవీటి రాధా షాక్

రెండు రోజుల్లోగా తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటానని ఆయన చెప్పారు. దీన్నిబట్టి ప్రజారాజ్యం పార్టీకి దూరం కావడానికి కూడా వంగవీటి రాధాకృష్ణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. కాగా, హైదరాబాదులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వంగవీటి రాధాకు సమాచారం అందింది. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆయనను కోరింది. దుర్గమ్మ ప్రభల కార్యక్రమానికి రావాలని రాధా చేసిన విజ్ఞప్తికి చిరంజీవి అంగీకరించారు. అదే సమయంలో మరో శాసనసభ్యుడు శ్రీనివాస రావు చిరంజీవి పాల్గొనే ఇతర కార్యక్రమాలను కూడా ఖరారు చేశారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే దుర్గమ్మ ప్రభల కార్యక్రమానికి చిరంజీవి రావడం ఆలస్యమవుతుందని రాధా వాదించారు. దీంతో దుర్గమ్మ ప్రభల కార్యక్రమానికి మాత్రమే రావడానికి చిరంజీవి అంగీకరించారు. ఆయన శనివారం మధ్యాహ్నం విజయవాడ చేరుకోవాల్సింది.
అయితే అకస్మాత్తుగా చిరంజీవి విజయవాడ పర్యటన రద్దయినట్లు రాధాకు సమాచారం అందింది. కొంత మంది సీనియర్లు మాట్లాడి చిరంజీవి విజయవాడ పర్యటనను రద్దు చేయించినట్లు తెలుస్తోంది. దీంతో వంగవీటి రాధాకృష్ణ చిరంజీవిపై భగ్గుమంటున్నారు. నిరుడు దుర్గమ్మ ప్రభల కార్యక్రమంలో చిరంజీవి కుమారుడు, సినీ నటుడు రామ్ చరణ్ తేజా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications