చంద్రబాబు తెలంగాణ వైఖరిని తప్పు పట్టిన కాంగ్రెసు ఎంపీలు

తెలంగాణపై ఢిల్లీ యాత్ర తలపెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు వేసిన కరపత్రంపై చంద్రబాబు ఫొటో లేకపోవడాన్ని మందా జగన్నాథం తప్పు పట్టారు. దాన్ని బట్టే చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు. తాము కాంగ్రెసు పార్టీగానే తెలంగాణ త్యాగమూర్తుల సంస్మరణ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఢిల్లీ యాత్ర చేపట్టడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేరని, ఈ స్థితిలో తెలంగాణ నేతల మాటలకు విలువ ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications