రోశయ్య ఢిల్లీ యాత్ర: పార్టీ ఇంచార్జీగా వీరప్ప మొయిలీకి ఎసరు

Veerappa Moily
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య తాజా ఢిల్లీ యాత్ర రాష్ట్ర కాంగ్రెసు సమీకరణాల్లో మార్పు తేవచ్చునని భావిస్తున్నారు. రోశయ్య వచ్చే నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. 2వ తేదీన జరిగే ఎఐసిసి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీని మార్చాలని ఆయన ఈ సమావేశాల్లో ఎఐసిసిని అడిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరప్ప మొయిలీ రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా కొనసాగుతున్నారు. వీరప్ప మొయిలీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు అనుకూలంగా ఉండడంతో రోశయ్య తగిన విధంగా వ్యవహరించలేకపోతున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణకు కూడా మొయిలీ అడ్డుపడుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. మొయిలీని తప్పిస్తే తప్ప ముందుకు సాగలేమనే అభిప్రాయంతో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో మొయిలీని మార్చాలని ఆయన సోనియాను అడుగుతారని అంటున్నారు.,br />
మొయిలీ మార్పుతో వైయస్ జగన్ కు చెక్ పెట్టే పనికి శ్రీకారం చుట్టాలనేది రోశయ్య ఆలోచనగా చెబుతున్నారు. మొయిలీని రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా తొలగించిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనే ఉద్దేశంతో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు. తద్వారా జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ తన మాటను కూడా బేఖాతరు చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డిని, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను మంత్రివర్గం నుంచి తొలగించడానికి మార్గం ఏర్పడుతుందని రోశయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఒక రకంగా నవంబర్ 2వ తేదీనే వైయస్ జగన్ కు కూడా కీలకం కానుందనే ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ పై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారనే మాట వినిపిస్తోంది. అయితే, అది ఇప్పుడే ఉండకపోవచ్చునని తెలుస్తోంది. డిసెంబర్ తర్వాతనే వైయస్ జగన్ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి వస్తుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+