అనంతపురం: అనంతపురం జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య చోటు చేసుకుంది. తాటిమర్రి మండలంలోని దొరిగింటికొండకు చెందిన దాడితోట గోపాల్ రెడ్డిని ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా చంపారు. ఈ ఘటన కడప జిల్లాలోని లింగాల మండలం అంబకపల్లిలో జరిగింది. ప్రత్యర్థులు స్కూటర్ పై వెళుతున్న గోపాల్ రెడ్డిని ముందుగా జీపుతో ఢీ కొట్టారు. స్కూటర్ పై నుండి పడ్డ గోపాల్ రెడ్డిని వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. గోపాల్ రెడ్డి అనంతపూర్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు. 2001లో జరిగిన ఓ జంట హత్య కేసులో గోపాల్ రెడ్డి మొదటి ముద్దాయి.