వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ప్రశ్నించిన శంకర రావు

P Shankar Rao
హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌లో అమరవీరుల సంస్మరణ సభను అడ్డుకోవడం దారుణమని కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకరరావు అన్నారు. సమైక్యవాది అయిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఫొటోను ఆ సభలో ఎలా పెడతామన్నారు. ఆ మాటకొస్తే ఓదార్పు యాత్ర చేస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ సోనియా, ఇందిరా, రాజీవ్‌గాంధీల ఫొటోలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారికి కూడా కాంగ్రెస్‌ పార్టీ పరంగా ఆర్థిక సాయం చేయాలని శంకరరావు డిమాండ్‌ చేశారు.

కాంగ్రెసు తెలంగాణ నాయకులు నిర్వహించిన మహబూబ్ నగర్ లో తెలంగాణ త్యాగధనుల సభలో వైయస్ ఫొటో పెట్టలేదని తప్పు పడుతూ కొంత మంది గొడవకు దిగిన విషయం తెలిసిందే. గొడవ చేసినవారిపై కాంగ్రెసు నేతలు వి. హనుమంతరావు, కె. కేశవరావు అప్పుడే తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా తెలంగాణకు చెందిన పలువురు నాయకులు ఆ గొడవపై వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+