సుప్రీంకోర్టులో సత్యం రాజుకు చుక్కెదురు: బెయిల్ రద్దు

అంతకుముందు హైకోర్టులో తనకు బెయిలు ఇవ్వాలంటూ రామలింగరాజు చేసుకున్న అప్పీలుకు హైకోర్టు స్పందించి బెయిలు ఇవ్వాల్సిందిగా తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం రామలింగరాజును బెయిలు ఎందుకు ఇవ్వాలో ప్రశ్నించింది. అయన తన ఆరోగ్యం తదితర విషయాల్ని ప్రస్తావిస్తూ బెయిలు మంజూరు చేయాలని కోరారు. అయితే అందుకు సిబిఐ తరఫు న్యాయవాది రామలింగరాజుకు బెయిలు ఇస్తే సాక్షులను ప్రభావితం చేయటం, ఉన్న సాక్ష్యాలను తారుమారు చేయటం వంటి అక్రమాలకు పాల్పడి కేసునుండి బయట పడడానికి అవకాశముందన్న సిబిఐ లాయరు వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. కాగా 7000 వేల కోట్ల సత్యం కంప్యూటర్ల కుంభకోణంలో 2009 జనవరిలో అరెస్టు అయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
