ఎన్టీఆర్, వైయస్సార్ మధ్య పోటీ: విగ్రహాలు స్థాపనపై గొడవ
Districts
oi-Srinivas G
By Srinivas
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లాలోని గూడూరులో ఓ స్థలంలో నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే దుర్గా ప్రసాదరావు భూమి పూజ చేశారు. అయితే అదే స్థలంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ విగ్రహాన్ని నిర్మించడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి పూజ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.