ఎమ్మార్ స్కామ్ తో చంద్రబాబుకు లింక్ ఉందనే అనుమానాలు: డిఎల్ రవీంద్రారెడ్డి

ఎమ్మార్ అక్రమాలపై ప్రభుత్వం విచారణ కోసం సిబిఐ ఎంక్వయిరీ కోరితే సిద్ధమని కేంద్ర హోంమంత్రి చిదంబరం చెప్పారన్నారు. వెంటనే ప్రభుత్వం సిబిఐకి ఆ కేసును అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఉన్న స్థలాన్ని వెనక్కి ఇవ్వాల్సిందిగా సూచించారు. స్థలాన్ని వెనక్కి ఇచ్చి సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేయాలని సైతం సూచించారు. లేకుంటే ఆ అక్రమాలలో చంద్రబాబుకు కూడా వాటా ఉన్నట్లు ప్రజలు భావించవలసి ఉంటుందన్నారు. పలు సమస్యలపై స్పందిస్తున్న చంద్రబాబు ఎమ్మార్ విషయంలో మాత్రం స్పందించటం లేదని, ఆయనకు వారినుండి ముడుపులు ఏమైనా ముట్టాయా అని ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనకు అక్కడ స్థలం ఉందని ప్రకటించటం అభినందనీయమన్నారు.












Click it and Unblock the Notifications