డిసెంబర్ తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు: ఏరాసు

నవంబర్ 1వ తేదీ రాష్ట్రావతరణ దినోత్సవంలో పాల్గొనడంలో తప్పేముందని ఆయన అడిగారు. ఉద్యమం మొదలైన తర్వాత కూడా తెలంగాణ నాయకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను కూలగొట్టాలనే తెలంగాణ నాయకుల ప్రకటనలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. వారి ప్రకటనలు అసహ్యం పుట్టించే విధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విగ్రహాలను కూలగొడతామని అనడం హాస్యాస్పదమని, కొమరం భీం విగ్రహం పెట్టవచ్చునని, అయితే మిగతా వారి విగ్రహాలను కూలగొట్టాలనడం సరి కాదని ఆయన అన్నారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అని ఆలోచించకుండా సమాజానికి సేవలు చేసినవారి విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications